AMARAVATHI

మద్యపానం నిషేధం దిశగా తమిళనాడు ప్రభుత్వం-జీవో విడుదల

ఆమలు జరిగేనా?

అమరావతి: తమిళనాడు ప్రభుత్వం మద్యపానం నిషేధం దిశగా చర్యలు చేపట్టింది..ఇందులో భాగంగా విడతలవారీగా ప్రభుత్వం (TASMAC) ఆధ్వర్యంలో నడిచే 5,329 మద్యం షాపుల్లో 500ల మద్యం షాపులను మూసివేసింది.. తమిళనాడు ఎన్నికల సమయంలో స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే పార్టీ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది..అధికారం చేపట్టిన తరువాత సీ.ఎం స్టాలిన్ ప్రభుత్వం మద్యం విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది..తమిళనాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణలను నిర్వహిస్తోంది..ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న 500 మ‌ద్యం దుకాణాల‌ను గురువారం నుంచి మూసివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తు,,ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది..మొదటగా పాఠశాలలు,,దేవాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసివేసింది.. క్ర‌మేపీ రాష్ట్రంలోని అన్ని మ‌ద్యం షాపుల‌ను మూసివేయనున్నదని తెలుస్తొంది..అయితే తమిళనాడు ప్రభుత్వం  తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఎంతవరకు అమలు జరుగుతుందో చూడాలి..ద‌శ‌ల‌వారీగా సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నా ఎంత‌వ‌ర‌కు సాధ్య‌ప‌డుతుందో చూడాలి.?

ఒక రాష్ట్రం మద్యం నిషేధిస్తే,,సరిహాద్దు రాష్ట్ర ప్రభుత్వాలకు విపరీతమై ఆదాయం వచ్చి పడుతుందనేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రకటించిన తరువాత అటు కర్ణాటలక,,తమిళనాడు,,మహారాష్ట్రల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి..అలాగే మద్యపాన నిషేధం విధించిన రాష్ట్రంలో ఆక్రమ మద్యం తరలింపు మాఫీయా రెచ్చిపోతుంది అనేందుకు ఎన్నోఉదహరణలు ఆంధ్రప్రదేశ్ లోనే  వున్నాయి..అంతదాక ఎందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని రకాల మద్యం బ్రాండ్లను తప్పించడం,, రేట్లు పెంచి అమ్మడంతో,,ప్రక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై పారింది..ఏతావాత తేలేది ఏమింటంటే,,నిషేధం విధించిన రాష్ట్రంలోని మాఫియా ముఠాలకు ఆక్రమ మద్యం తరలింపు ద్వారా వేల కోట్ల రూపాయల వ్యాపారం అందివస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు??  

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *