AGRICULTURENATIONAL

ఉత్తరాది రాష్ట్రంల్లో మండిపోతున్న ఎండలు, 47.8 డిగ్రీలు నమోదు

అమరావతి: దేశంలో వాతావరణం ఈ సంవత్సరం భిన్నంగా కన్పిస్తొంది..దక్షణిది రాష్ట్రల్లో ఆల్పపీడ ద్రొణి ప్రభావ కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తుండగా,ఉత్తరాది రాష్ట్రంల్లో ఎండలు పతాక స్థాయిలో 47.8 డిగ్రీలు నమోదు అవుతున్నాయి..ఉత్తర మధ్యప్రదేశ్,,గుజరాత్,,బీహార్,,ఢిల్లీ,, హర్యానా,,పంజాబ్,,రాజస్థాన్,, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో హీట్ వేవ్ కొనసాగుతోంది..ఇండియన్ మెట్రలాజికల్ డిపార్డ్ మెంట్,, ఢిల్లీలో 3 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.. శుక్రవారం వరకు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.. ఢిల్లీలో మే 25న జరిగే లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై రికార్డు స్థాయిలో నమోదువుతున్న ఉష్ణోగ్రతలు ప్రభావం చూపే అవకాశం కన్పిస్తొంది..నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లో 47.8 డిగ్రీల సెల్సియస్‌,, ఆగ్రాలో 47.7 డిగ్రీలు,, సఫ్దర్‌జంగ్‌లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..ఎండ తీవ్రత పెరగడంతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది..ఎండ తీవ్రత పెరగడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.. అత్యవసరమైతేనే తప్ప బయటకి రావద్దని, ఇంట్లోనే ఉండి ఎండ వేడిమి నుంచి రక్షణ పొందాలని అధికారులు సూచనలు చేశారు..ఢిల్లీలోని జూపార్కులో జంతువులు ఎండ వేడిమిని తట్టుకునేలా జూ అధికారులు కూలర్లు,ఇతర ఏర్పాట్లు చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *