AMARAVATHICRIME

ఝాన్సీ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అసద్ అహ్మద్, గులామ్‌లు మృతి

నా కుమారుడి ఆత్మశాంతిస్తుంది..

అమరావతి: అమాయకులైన పౌరుల ప్రాణాలు బలిగొటుంన్న గ్యాంగ్ స్టార్స్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని,యు.పి ముఖ్యమంత్రి యోగీ అథిత్యనాధ్,సమావాద్ పార్టీ అధ్యక్షడు అఖిలేష్ యాదవ్ కు యు.పీ అసెంబ్లీలు స్పష్టం చేశారు.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వద్ద గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ తో పాటు మరొకరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్ లో జరిగిన ఉమేష్ పాల్ హత్యలో అసద్ అహ్మద్, గులామ్‌లు వాంటెడ్ క్రిమినల్స్ గా ఉన్నారు..ఈ కేసులో అస‌ద్‌పై రూ.5 ల‌క్షల రివార్డు కూడా ఉంది..పోలీసుల ఝాన్నీ ప్రాంతంలో కుబింగ్ జరుపుతున్న సమయంలో,,వీరి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం వారిని కాల్చి చంపింది..వారి నుంచి అధునాతన ఆయుధాలు,,సెల్‌ఫోన్లు,, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు..

2005లో BSP ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకేసులో ఉమేష్ పాల్ అనే న్యాయవాది సాక్షిగా ఉన్నారు..ఫిబ్రవరి 24వ తేదిన ప్రయాగ్‌రాజ్‌లోని తన ఇంటి బయట పగటిపూట అతన్ని దారుణంగా కాల్చి చంపారు..ఆ దాడిలో అతని భద్రతా సిబ్బంది అయిన పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు..

సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిక్ అహ్మద్, కిడ్నాప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.. జైల్లో ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు రావటంతో,, ఆ కేసులో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ ను సుప్రీంకోర్టు ఆదేశాలతో గుజరాత్ జైలుకు తరలించారు.. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్న అతిక్ అహ్మద్,, రెండు నెలలుగా కోర్టు విచారణ కోసం ఉత్తరప్రదేశ్ వస్తూ ఉన్నారు..పలు సెటిల్ మెంట్స్ లో పాల్గొంటున్నరని వార్తలు వెలువడుతున్నాయి..

శాంతిదేవీ:- తన కుమారుడిని దారుణంగా కాల్చి చంపిన వారికి తగిన శిక్ష పడిందని,రాజుపాల్ తల్లి  శాంతిదేవీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపింది..ఇప్పుడు తన కుమారుడి ఆత్మశాంతిస్తుందని,మరే తల్లికి ఇలాంటి దుర్ఘటలన ఎదురుకాకుండి సీ.ఎం యోగీ తగిని చర్యలు చేపట్టాలని కోరింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *