AMARAVATHIDISTRICTS

యజమానుల అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లు, ప్లెక్సిలు అతికించరాదు

జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి కన్నమ నాయుడు

నెల్లూరు: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు, వారి అనుచరులు ప్రచార కార్యక్రమంలో భాగంగా పబ్లిక్,,ప్రవేట్ భవనాలు, కట్టడాలు,,స్థలములలో సంబందిత యజమాన్యపు అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, గోడలపై వ్రాతలు, స్టికర్ల,,జెండాలు,,ఫ్లెక్సిలు,,హోర్డింగ్ల ఏర్పాటు వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించడం జరిగిందని ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి కన్నమ నాయుడు పేర్కొన్నారు..ఈ రకమైయన చర్యల కారణంగా వివిధ ప్రభుత్వ,,ప్రవేట్ ఆస్తులకు రూపు చెరిగి శాశ్వత/ పాక్షిక / తాత్కాలిక నష్టం జరుగుచున్నదన్నారు.. ఎన్నికల అనంతరం సదరు పోస్టర్లు /స్టిక్కర్లు /గోడల వ్రాతలు / ఫ్లెక్సిలు వగైరాలు తొలిగించేందుకు సదరు ఆస్తులకు పూర్వస్థితి పునరుద్ధరణ చేసేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి లేదా ప్రవేట్ ఆస్తుల విషయంలో సదరు యజమానులే ఖర్చులను భరించవలసివస్తున్నదని వెల్లడించారు..రెండు సందర్భాలలోను సాధారణ ప్రజానీకమే, వారి ప్రమేయం లేకపోయినప్పటికి సదరు ఖర్చులను భరించవలసివస్తున్నదని అన్నారు.ఈ నేపద్యంలో ఎన్నికల సంఘం వారిచే జారీ చేయబడిన ప్రచార సంబందిత ముఖ్యమైన నియామావళి అనుసరించాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *