యువత భవిష్యత్తే మన రాష్ట్ర భవిష్యత్- డాక్టర్ పొంగూరు.నారాయణ
44 డివిజన్ ఎన్నికల ప్రచారం..
నెల్లూరు: యువత భవిష్యత్తే…రాష్ట్ర భవిష్యత్ అని…మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు..శనివారం ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గం 44 డివిజన్ పోస్టాఫీసు,తిప్పరాజువీధి,,కర్ణాలవీధి తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి…నన్ను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.