NATIONAL

బెంగళూరు అంటే ఒక బ్రాండ్ గుర్తుకు వస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: సంప్రదాయంను కాపాడుకుంటూ, సాంకేతికత నైపుణ్యంలో వేగంగా అడుగులు వేస్తున్న నగరం బెంగళూరు అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.ఈ సందర్బంలో ప్రధాని మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని,ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్దిక మాద్యం కమ్ముకుని వస్తున్న సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారన్నారని పేర్కొన్నారు. పెట్టుబడి దారులను, రెడ్ టాపిజం నుంచి విముక్తి చేసి, వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామన్నారు. గతంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నమని ఇందులో బాగంగా స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామన్నారు. కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని,ఇలాంటి సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆర్థిక సంక్షోభం నుంచి దేశం శరవేగంగా బయటపడుతుందని ఆర్థికవేత్తలు చెప్పినట్లు గుర్తు చేశారు. వివిధ దేశాలతో కేంద్రం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

14 hours ago

తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోంది-జెడీ.లక్ష్మీనారాయణ

అమరావతి: జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…

16 hours ago

జాతీయ సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి

తిరుపతి: సంస్కృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శుక్రవారం సతీ సమేతంగా తిరుపతికి చేరుకున్న ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ కు…

18 hours ago

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను వేస్తే కఠిన చర్యలు-M.H.O Dr. వెంకట రమణ

నెల్లూరు: బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడంతో పశువులు, కుక్కలు, పందులకు ఆయా ప్రాంతాలు ఆవాసంగా మారడంతో పాటు దోమల వ్యాప్తికి…

2 days ago

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు నోటీసులు ఇచ్చిన ఎన్నికల సంఘం

అమరావతి: బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , కాంగ్రెస్‌ అగ్రనేత…

2 days ago

యజమానుల అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు, స్టిక్కర్లు, ప్లెక్సిలు అతికించరాదు

జిల్లా ఎన్నికల ప్రవర్తన నియమావళి అధికారి కన్నమ నాయుడు నెల్లూరు: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్ధులు,…

3 days ago

This website uses cookies.