పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ తో దీక్ష విరమించిన హరిరామజోగయ్య

అమరావతి: కాపుల రిజర్వేషన్స్ కోసం అమరావణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎం.పి హరిరామజోగయ్యతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోన్ లో మాట్లాడడంతో అయన కాపు జెఏసి సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి.రాము అందిచిన నిమ్మరసం త్రాగి దీక్ష విరమించారు.వయస్సు,ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలిని కోరినట్లు పవన్ తెలిపారు.బలమైన పోరాటాలు చేయగల సమర్గులు,అనుకున్నది సాధించే పట్టుదల వున్న వ్యక్తి,లక్ష్యం సాధించాలి అంటే ముందుగా మీరు ఆరోగ్యం వుండాలని కోరినట్లు పేర్కొన్నారు..కాపు రిజర్వేషన్లపై ఈ పద్దతిలో కాకుండా చట్టం ద్వారా పోరాటం చేయాలని కోరారు.
హరిరామజోగయ్య:- పవన్ కళ్యాణ్ నాకు దీక్ష విరమించాలని సలహా ఇచ్చారు.వారి సలహా మేరకు నేను దీక్ష విరమిస్తున్నాను అని,,రిజర్వేషన్లపై హైకోర్టులో పోరాడుతాను అని జోగయ్య తెలిపారు.