హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి పార్టీ పెట్టింది దేశం కోసం,,చిల్లరమల్లర రాజకీయాలు కోసం పెట్టలేదని,గుణాత్మకమైన మార్పు కోసం పార్టీ పనిచేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ వ్యాఖ్యనించారు.సోమవారం తెలంగాణ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్ఠసారథిలను KCR కండువా కప్పి,,భారత్ రాష్ట్ర సమితి పార్టీ (BRS) లోకి ఆహ్వనించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఒకప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం..జీవితాలను ఆస్తులను,కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను త్యాగం చేసేటటువంటి రాజకీయాలు ఉండేవన్నారు..ఆ తరువాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో నాటి ప్రధాని నెహ్రూ ఆధ్వర్యంలో,అంబేద్కర్ మార్గదర్శనంలో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకుని కార్యలకాపాలు మొదలుపెట్టమన్నారు..చక్కటి ప్రయాణాన్ని తొలి అడుగుతో మొదలుపెట్టమని కేసీఆర్ అన్నారు..