NATIONAL

రాహుల్‌ యువరాజు లాగా ప్రవర్తిస్తుండడమే కారణం-గులాంనబీఆజాద్‌

గులాంనబీ ఆజాద్‌ కొత్త పార్టీ..

అమరావతి: 53 సంవత్సరాల నుంచి తాము కాంగ్రెస్‌ కోసం రక్తం ధారబోశామని,,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్‌కు, ట్వీట్టర్‌కు మాత్రమే పరిమితం అయ్యిందని,, తమలాంటి వాళ్ల పార్టీ విడి బయటకు వస్తున్నరంటే,,రాహుల్‌ యువరాజు లాగా ప్రవర్తిస్తుండడమే కారణమంటూ గులాంనబీఆజాద్‌(73) మండిపడ్డారు.అదివారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన గులాంనబీ ఆజాద్‌, జమ్ములో భారీ రోడ్‌షో నిర్వహించారు.అనంతరం సైనిక్‌ కాలనీలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ పేరు,జెండా జమ్ముకశ్మీర్‌ ప్రజలే నిర్ణయించాలన్నారు..పార్టీ పేరు హిందుస్తాన్ ను ప్రతిబింబిస్తుందన్నారు.జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.రాష్ట్రంలో విద్యా,నిరుద్యోగులకు ఉపాధి అవకాశలపై దృష్టి పెడతామన్నారు..గులాంనబీ ఆజాద్‌ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని,,బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్న నేపధ్యంలో,వాటికి సమాధానం ఇస్తు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని ఆజాద్‌ ప్రకటించారు.నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లేదా పీడీపీతో పొత్తు ఉంటుందని ప్రచారంపై అయన పెద్దగా స్పందించలేదు. గులాంనబీఆజాద్‌కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

40 mins ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

6 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

7 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

8 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

24 hours ago

This website uses cookies.