NATIONAL

గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి ప్రారంభంమైన భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ

అమరావతి: దేశ సరిహద్దు,వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ మొదలైంది..ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరుదేశాల సైన్యాలు గురువారం సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి..2020 జూన్​లో జరిగిన గల్వాన్‌ సంఘటన తరువాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి..దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పొందుకు భారత్‌-చైనా సైనికాధికారులు పలు విడతలుగా చర్చలు జరిపారు..ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్‌ జనరల్‌ స్థాయిలో చర్చలు జరిపారు..సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్‌ సరస్సు,,గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17వ తేదిన జరిగిన చర్చల అనంతరం గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి ఇరుదేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

8 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

8 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

11 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

11 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

12 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

12 hours ago

This website uses cookies.