NATIONAL

గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి ప్రారంభంమైన భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ

అమరావతి: దేశ సరిహద్దు,వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాలైన గోగ్రా- హాట్‌స్ప్రింగ్స్​ నుంచి భారత్‌-చైనా బలగాల ఉపసంహరణ మొదలైంది..ఇరుదేశాల సైనిక కమాండర్ల మధ్య ఇటీవల జరిగిన 16వ విడత చర్చల సందర్భంగా ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇరుదేశాల సైన్యాలు గురువారం సాయంత్రం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..సమన్వయం, ప్రణాళికబద్ధంగా ఇరుదేశాల బలగాల ఉపసంహరణతో సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఏర్పడనున్నాయని పేర్కొన్నాయి..2020 జూన్​లో జరిగిన గల్వాన్‌ సంఘటన తరువాత వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి..దీంతో అక్కడ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పొందుకు భారత్‌-చైనా సైనికాధికారులు పలు విడతలుగా చర్చలు జరిపారు..ఇటీవల 16వ విడతలో భాగంగా మేజర్‌ జనరల్‌ స్థాయిలో చర్చలు జరిపారు..సంప్రదింపుల ఫలితంగా పాంగాంగ్‌ సరస్సు,,గోగ్రాపోస్టు వద్ద బలగాల ఉపసంహరణ జరిగింది. జులై 17వ తేదిన జరిగిన చర్చల అనంతరం గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్‌ నుంచి ఇరుదేశాల బలగాలు, సైనిక సంపత్తిని వెనక్కి తీసుకోవాలని తాజాగా నిర్ణయించాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *