AMARAVATHIDISTRICTS

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు జిల్లాలో భారీ వర్షం పడింది..వర్షంతో పాటు పిడుగు పడడంతో ఏలూరు జిల్లాలోని లింగపాలెం మండలం యడవల్లి గ్రామానికి చెందిన పరస రామారావు (41) పశువులను మేపడం కోసం పొలంలో ఉండగా మరణించారు..పిడుగు పాటుకు పశువులు సైతం మృతిచెందినట్లు తెలుస్తోంది.. జిల్లాలోని ముసునూరు మండలంలో ఈదురుగాలులకు వందల ఎకరాల్లో అరటిపంట నేలకూలింది.. పిడుగు పాటుతో తల్లి కూతుళ్ల మృతి:- గుడివాడలో కూడా గాలివాన బీభత్సం సృష్టించింది.. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడగా, భారీ వృక్షాలు నేలకొరిగాయి.. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఊటుకూరులో పిడుగుపాటుకు తల్లి, కూతుళ్లు మృతి చెందారు..పొలం నుంచి ఇంటికి వస్తుండగా పిడుగు పడటంతో బొందల నాగేంద్రం (52), యండ్రపల్లి నాగరాణి (25) మృతి చెందారు..అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి..పొలంలో ఉన్న ధాన్యం తడిసి ముద్దాయింది..దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో భారీ హోర్డింగులు వర్షం ధాటికి కిందపడ్డాయి..విజయవాడ, గుంటూరు నగరాల్లో వర్షంతో ట్రాఫిక్ ‘ఎక్కడికక్కడ స్థంభించిపోయింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *