AMARAVATHIHYDERABAD

ఎన్డీఏలో కూటమిలో చేరతానని సీఎం కేసీఆర్ మా వెంట పడ్డాడు-ప్రధాని మోదీ

హైదరాబాద్: ఎన్డీఏలో కూటమిలో చేరతానని సీఎం కేసీఆర్ మా వెంట పడ్డాడు కానీ కేసీఆర్ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంచనల నిజాలు బయటపెట్టారు..మంగళవారం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్బంలో ఏర్పాటు చేసిన జనగర్ఝన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ,, తెలంగాణలో ఒక కుటుంబం పాలన సాగుతొందని,,ఎంతో మంది బలిదానాలతోనే తెలంగాణ సాకారమైందన్నారు.. తెలంగాణ వచ్చాక కేసీఆర్, ఆయన కుమారుడు,, ఆయన కుమార్తె,, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని ఆరోపించారు..కేంద్రం ఇచ్చిన నిధులనూ బీఆర్ఎస్ దోచుకుంటోందని,, అలాంటి కుటుంబ పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వవద్దని కోరారు.. ఉద్యోగాల్లో అసలైన యువతకు అవకాశం రావడం లేదన్నారు..కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ప్రవర్తించి,,ఆర్భాటంగా స్వాగతం పలికాడని,,ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయిందని అన్నారు.. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదన్నారు..I.N.D.I.A కూటమి వీరిని రానీవ్వక పోవడంతో మళ్లీ కేసీఆర్ నా దగ్గరికి వచ్చి,,తన కొడుకును ఆశీర్వదించమని అడిగాడని,, ఇందుకు నేను నిరాకరించడంతో నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి భయ పడుతున్నాడని వెల్లడించారు..కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదన్నారు..బీఆర్ఎస్ కు కాంగ్రెస్ తో తెరచాటు ఒప్పందాలు వున్నాయన్నారు..కర్ణాటకలో కాంగ్రెస్,,బీఆర్ఎస్ కు ఇలాగే చీకటి ఒప్పందాలు జరిగాయని తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *