హైదరాబాద్: నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడేకు ఆగష్టు 14వ తేదీన అమన్ పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి బెదిరింపు వచ్చింది..నీవు ఏం చేశావో నీకు తెలుసా? దానికి నీవు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది….నిన్ను హతమారుస్తాం అని ట్వీట్ చేశారు..ఈ బెదిరింపు ట్వీట్ పై సమీర్ వాంఖడే గోరేగాం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో,పోలీసులు వాంఖడే వాంగ్మూలాన్ని రికార్డు చేసి under section 507 క్రింద కేసు నమోదు చేశారు.. ముంబయి ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టరుగా పనిచేసిన సమీర్ వాంఖడే 2021 అక్టోబరులో క్రూయిజ్ షిప్ పై దాడి చేసి షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు 19 మంది ప్రముఖలను అరెస్టు చేసిన ఘటనతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించారు..బెదిరింపు ట్వీట్ వచ్చిన ట్విట్టర్ ఖాతాకు ఫాలోయర్స్ ఎవరూ లేరని,, ఈ ఖాతాను సమీర్ వాంఖడేను బెదిరించేందుకు క్రియేట్ చేశారని పోలీసులు భావిస్తున్నారు..