అమరావతి: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో గురువారం రాత్రి PFI రాష్ట్ర మాజీ కార్యదర్శి రవూఫ్ ను NIA అధికారులు అతని ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వం PFIను బ్యాన్ చేసినప్పటి నుంచి రవూఫ్ పరారీలో ఉన్నాడు.రవూఫ్ ను NIA ఆఫీస్ కు తరలించి అధికారులు విచారణ చేస్తున్నారు. గత నెలలో దేశవ్యాప్తంగా PFI కార్యలయలపై దాడి చేసిన NIA, దాదానె 100 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను అరెస్టు చేసింది. దాడుల సమయంలో రవూఫ్ జాగ్రత్తలు తీసుకొవడంతో,అతన్ని అచూకీ తెలియని ఎన్‌ఐఏ అతడిపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది.ఇదే సమయంలో దేశవ్యాప్తంగా PFI కార్యాలయాలపై దాడులు,నాయకుల అరెస్టులను నిరసనగా సెప్టెంబర్ 23న కేరళలో హర్తాళ్‌కు పిలుపునిచ్చిన నాయకులలో రవూఫ్ ప్రముఖుడు.హర్తాళ్ సందర్భంగా కేరళలో పెద్దఎత్తున హింస,ఆస్తుల విధ్వసం జరిగింది. హర్తాళ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు హింసకు పాల్పపడిన 1,500 మంది PFI సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.