NATIONAL

కేదారేశ్వరుని క్షేత్రం రక్షణకు ఐటీబీపీ జవాన్లు

అమరావతి: హిమగిరిల్లో కొలువై వున్న కేదార్‌నాథుడి పేరు తలుచుకుంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.. సంవత్సరంలో 6 నెలలు గుడి తీసివుంటే,,మరో 6 నెలలు మూసి ఉండే ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 15 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది..ఈ సంవత్సరం నుంచి కేదారేశ్వరుని గుడిని ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల రక్షణలోకి వచ్చింది..మహారాష్ట్రకు చెందిన ‘లాకి’ కుటుంబం సౌజన్యంతో, కేదారేశ్వరుడి ఆలయంలోని అంతర్భంగాలో గర్బ గుడి గోడలు, నాలుగు స్తంభాలు, సీలింగ్‌కు 560 బంగారం రేకులు ఉపయోగించి తాపడం పూర్తి చేశారు..ఈ రేకుల తయారీలో 40 కిలోలకు పైగా బంగారం వాడారని అంచనా..ఈ కార్యక్రమం అక్టోబర్ 26 నాటికి ముగిసింది..బంగారం తాపడం కార్యక్రమంను ఆలయ పూజారులు దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఆలయ బోర్డు ఈ ప్రక్రియను పూర్తిచేసింది..11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రంలో ఉష్ణోగ్రత అన్నికాలాల్లో కనిష్టంగా నమోదు అవుతుంది..శీతాకాలంలో కేదార్‌నాథ్ క్షేత్ర పరిసరాల్లో కురిసే మంచు 5 నుంచి 6 అడుగులమేరకు పేరుకుపోతుంది..శీతాకాలం ప్రారంభం అయిన తరువాత స్థానికులు మైదాన ప్రాంతాలకు వెళ్లిపోతారు..శీతాకాలం పూర్తయిన తర్వాత మళ్లీ తమ ఇళ్లకు చేరుకుంటారు.. శ్రీ భద్రీనాథ్, కేధార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ విజ్ఞప్తి మేరకు ఆలయ రక్షణకు ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రెటరీ ఎస్ఎస్ సంధు, ఐటీబీపీ దళాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.. మంగళవారం నుంచి ఐటీబీపీ జవాన్లు తమ విధులు ప్రారంభించారు..షిప్టుకు ఇద్దరి వంతున 24 గంటలు ఐటీబీపి సిబ్బంది గుడి పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్నారు..ఆలయం తిరిగి 2023 ఏప్రిల్ నెలలో తెరవబడుతుంది..

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

4 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

5 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

8 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

8 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

8 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

1 day ago

This website uses cookies.