AMARAVATHIDISTRICTS

గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం-కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

తిరుపతి: భారత జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ సామాజిక బాధ్యతతో పర్యావరణం,,ఇంధన సంరక్షణ పట్ల ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కాలుష్య నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, మనం అందరం గ్రీన్ ఇండియాలో భాగస్వాములవుదాం అని రోడ్డు రవాణా,జాతీయ రహదారుల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు..బుధవారం జాతీయ రహదారుల వెంబడి దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి రేణిగుంట మండలం కొత్తపాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి వెంబడి మొక్కలు నాటి ప్రారంభించి, రేణిగుంట నుండి NH-71లోని నాయుడుపేట వరకు 1000 మొక్కలు  నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంలో గఢ్కరీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ డైనమిక్ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందుతోందని అన్నారు.అన్ని చెట్లు మరియు మొక్కలు ‘హరిత్ పాత్’ మొబైల్ యాప్ ద్వారా జియో-ట్యాగ్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. వాతావరణ మార్పు” యొక్క సవాళ్లకు భారత ప్రభుత్వం యొక్క ఖచ్చితమైన ప్రతిస్పందనలలో రండి మనం అందరం కలిసి చేతులు కలపండి మరియు గ్రీన్ ఇండియాలో భాగమవుతాము అని పిలుపునిచ్చారు. పర్యావరణానికి హితమైన బయో ఇథనాల్ ఇంధనం వాడకం లోకి తీసుకు వస్తున్నాం, దీనివల్ల కాలుష్యం తగ్గడం, పెట్రోల్ , డీజల్ ధరలు తగ్గతాయి అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *