NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది..నరేంద్రమోడీ తల్లి హీరాబెన్(100) కన్నుమూశారు..రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో చికిత్సలకు అమె శరీరం స్పందిస్తుండడంతో,,వైద్యులు రెండు రోజుల్లో అమెను ఇంటికి పంపిస్తామని తెలియచేశారు..చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి., మాతృమూర్తి మరణ వార్త తెలియడంతో, ప్రధాని నరేంద్రమోడీ  ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ కు చేరుకున్నారు..ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ నరేంద్రమోడీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది..తన మాతృమూర్తి హీరాబెన్‌ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్‌ చేశారు..‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు..ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది.. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు..ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు..

ప్రోటోకాల్ పక్కన పెట్టి:- గుజరాత్లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించిన మోడీ,,ప్రోటోకాల్ పక్కన పెట్టి తల్లి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొని,,తల్లి పాడె మోశారు..తల్లి మృతదేహం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

2 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

2 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

3 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

23 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

1 day ago

This website uses cookies.