AMARAVATHIDISTRICTS

సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి- గవర్నర్ అబ్దుల్ నజీర్

సంస్కృతం లేనిదే సంస్కృతి లేదు..
తిరుపతి: సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటిగా వున్న విషయం తెలిసిందేనని, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం,మైసూర్లోని సంస్కృతి ఫౌండేషన్ ల సహకారంతో జాతీయ సంస్కృత సదస్సును నిర్వహించేందుకు ఆధ్యాద్మిక నగరమైన తిరుపతిని వేదికగా ఎంచుకున్నందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & సాహిత్య అకాడమీ వారికి అభినందనలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు..శుక్రవారం సాయంత్రం స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ వారికి పూర్ణకుంభ స్వాగతం లభించింది. చెలికాని అన్నారావు భవన్ లో ఏర్పాటు చేసిన విజ్ఞాన , పుస్తక , వస్తు ప్రదర్శిని, పాండు లిపి, తాళపత్ర గ్రంధాలు ప్రదర్శనలు తిలకించి, జాతీయ సంస్కృత సదస్సు ముగింపు సందర్భగా రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా జాతీయ సంస్కృత సమ్మేళనం నిర్వహించి ,సంస్కృతాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడం, సంస్కృత సాహిత్యః, భాష పునాది అనే వాస్తవ అంశంపై ప్రజలలో అవగాహన పెంచడం అనే దృష్టితో నిర్వహించబడడం సంతోషంగా ఉందన్నారు..
లైబ్రరీలో 1,22,946 పుస్తకాలు:- తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం,జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అనే సంస్కృతంలో రెండు ప్రసిద్ధ ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. యూనివర్శిటీ లైబ్రరీలో సుమారు 1,22,946 పుస్తకాలు మరియు సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం మరియు దేవనాగరి, గ్రంథం, తెలుగు, కన్నడ, తీగలరి మొదలైన వివిధ లిపిలలో 6000 కంటే ఎక్కువమాన్యుస్క్రిప్ట్ లు వున్నాయని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *