EDUCATION JOBS

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్ ఫలితాలు శుక్రవారం ఉదయం తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌లో ఫలితాలు విడుదల చేశారు..ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన పోలు లోహిత్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించగా, ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ, పల్లి జయలక్ష్మి, ఎం. హిమవంశి తర్వాతి ర్యాంకుల్లో నిలిచారు..అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో జుతూరి నేహ మొదటి ర్యాంకు సాధించగా, వీ.రోహిత్‌ రెండో ర్యాంకు, కే.తరూణ్‌ కుమార్‌ రెడ్డి, కే.మహీత్‌ అంజన్‌, జీ.శ్రీరామ్‌ తరువాత స్థానాల్లో నిలిచారు..అభ్యర్థులు ఎంసెట్ ఫలితాల కోసం https://eamcet.tsc-he.a-c.in, ఈసెట్‌ ఫలితాల కోసం https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు..మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా‌.. ప‌రీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

15 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

16 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

20 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

21 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

22 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

2 days ago

This website uses cookies.