AMARAVATHIHEALTH

ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుంది-డాక్టర్ పి.వి.రమేష్

నెల్లూరు: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుందని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు..ఆదివారం డాక్టర్ జెట్టి శేషారెడ్డి 13వ వర్ధంతి సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఎవరి ఆరోగ్యం వారే చూసుకోవడం ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న మనలాంటి దేశాల్లో సాధ్యం కాదన్నారు..వ్యాధులకు వైద్యం చేయించడమే కాకుండా వ్యాధులు రాకుండా తీసుకొనే నివారణ చర్యలు కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలన్నారు..కొత్త కొత్త స్కీములు ప్రవేశపెట్టడంతోనే ప్రజలందరికీ వైద్యం అందదని, వైద్యానికి అయ్యే ఖర్చులను రోగాలతో బాధపడుతున్న పేదవారికి సాధ్యం కాదన్నారు..ఆరోగ్య రంగానికి బడ్జెట్లో కేటాయింపులు  పెంచడంతోపాటు ఆరోగ్య వ్యవస్థను, వైద్య విద్యను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు..ఈ సదస్సులో చండ్ర.రాజగోపాల్, ఆర్.నగేష్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నవకోటేశ్వరరావు, జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం, రాము, మెడికల్..అధ్యక్షులు మధు, ఎ.పి మెడికల్…గౌరవ అధ్యక్షులు సతీష్, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డా. బి రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రెసిడెంట్  డాక్టర్ ఎం.వి.రమణయ్య, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *