బ్రిటన్‌లోనూ వాడుకలోకి రాన్నున UPI ఆధారిత చెల్లింపులు-NPCL

అమరావతి: ప్రపంచంలోనే రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) గుర్తింపు పొందింది.. 2021లో భారత్‌లో UPI లావాదేవీల మొత్తం విలువ 940 బిలియన్ డాలర్లకు చేరుకుంది..UPI ఆధారిత చెల్లింపుల వ్యవస్థ త్వరలో బ్రిటన్‌లోనూ వాడుకలోకి రాన్నుది..చెల్లింపుల సంస్థ Payxpert సహకారంతో బ్రిటన్‌లోనూ చెల్లింపులు జరిపేందుకు UPI సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తామని యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ రూపకర్త, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCL) ఓ ప్రకటన తెలిపింది..ఈ పద్దతి బ్రిటన్‌లోని భారతీయ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొంది..ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ NPCL,, ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ Payxpertతో ఒప్పందం కుదుర్చుకుంది..ఈ ఒప్పందం ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత భారతీయ చెల్లింపుల విధానం,, బ్రిటన్‌లోనూ అందుబాటులోకి వస్తుంది..బ్రిటన్‌లో UPI అందుబాటులోకి వస్తే తమకు కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయని Payxpert సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ ఆర్మ్ స్ట్రాంగ్ పేర్కొన్నారు..ఇప్పటికే UPI ద్వారా చెల్లింపుల విధానం భూటాన్,, నేపాల్ లో ప్రారంభం అయ్యాయి..ఇటీవలే ప్రాన్స్ తోను UPI విధానంలో చెల్లింపులు జరిపేందుకు చర్యలు జరుగుతున్నాయి.. త్వరలోనే Rupay card ద్వారా చెల్లింపులు గణనీయంగా పెరుగుతాయని ఆర్దిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు..