INTERNATIONAL

ఏ దేశం ఆపదలో ఉన్నామొదటగా స్పందించేది భారత్ మాత్రమే-ప్రధాని మోదీ

సిడ్నీ…

అమరావతి: ఒకటే భూమి-ఒకటే ఆరోగ్యం(వసుధైక కుటుంబకం) నినాదంతో ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానిదే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు..మంగళవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ప్రపంచంలో ఎక్కడ ఆపద ఉన్నా,,భారతదేశం స్పందిస్తుందన్నారు..కరోనా సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ ఇండియాలోనే జరిగిందని తెలిపారు.. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని,,అందులో భాగంగానే సౌర విద్యుత్ తయారీ, వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణాన్ని రక్షిస్తుందని వెల్లడించారు..మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు, కానీ ఇప్పుడు యోగా మనల్ని కలుపుతుందని అన్నారు..

భారతదేశంను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే తన లక్ష్యం,తన కల అని స్పష్టం చేశారు..మూడు (CCC) కామన్ వెల్త్,,కర్రీ,, క్రికెట్ అనేవి భారత్-ఆస్ట్రేలియా దేశాలను కలుపుతున్నాయని అలాగే మూడు (EEE)లు ఎనర్జీ,,ఎకానమీ,, ఎడ్యుకేషన్ అనేది కూడా రెండు దేశాలను ఏకం చేస్తున్నాయని వివరించారు..అలాగే మూడు (DDD) ల గురించి వివరించారు.. భారత్-ఆస్ట్రేలియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని,,ఇది రెండు దేశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు.. ప్రపంచంలోని ఏ దేశం అయినా ఆపదలో ఉందీ అంటే మొదటగా స్పందించేది భారత్ మాత్రమేనన్నారు..అందుకే భారత్ ను విశ్వగురుగా గుర్తిస్తున్నారని,,భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదన్నారు..ఆస్ట్రేలియాతో భారత్‌కు దశాబ్దాల అనుబంధం ఉందన్నారు.. బ్రిస్‌బేన్‌లో త్వరలో భారత దౌత్యకార్యాలయాన్ని ఏర్పాటు చేస్తునట్టు ప్రకటించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *