AMARAVATHIDISTRICTS

నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పొంగూరు.నారాయణ

4వ రోజు 30 మంది అభ్యర్థులు..
నెల్లూరు రూరల్ లో ఆదాల, సిటీలో నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో 4వ రోజు సోమవారం పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా 30 మంది అభ్యర్థులు 41 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
నెల్లూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొప్పాల రఘు ఒక సెట్ నామినేషన్ పత్రాలను నెల్లూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ కు అందజేశారు.
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గా పొంగూరు నారాయణ, పొంగూరు రమాదేవి, వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ పత్రాలను మునిసిపాల్ కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వికాస్ కు అందజేశారు.
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మలోలకు అందించారు.
సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత చెరో రెండు సెట్లను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూల చంద్రశేఖర్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేసుకు అందజేశారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మధులతకు అందజేశారు. వైయస్సార్సీపి అభ్యర్థి మేకపాటి విక్రం రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అయింది.
ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రేమ్ కుమార్ కు అందజేశారు.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులుగా బుర్రా మధుసూదన్ రావు, తాడికొండ రాంబాబు ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విద్యాధరికి అందజేశారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *