నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ కోల్పోయింది..సోమవారం బిహార్‌లోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ప్రచారం ముగించుకుని హెలికాప్టర్లో బయల్దేరారు..టేకాఫ్ క్రమంలో హెలికాప్టర్ నియంత్రణ కోల్పోయి కుడివైపు దిశగా కొంతసేపు ఊగిసలాడింది.. ఒక దశలో నేలను తాకబోయింది.. వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్‌ను కంట్రోల్ చేశాడు. దీంతో అది నిర్ణీత మార్గంలోనే టేకాఫ్ తీసుకుని బయల్దేరింది.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.