CRIMEHYDERABAD

హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల రచించిన కుట్రను స్పెషల్ పార్టీ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు సూత్రధారీ అయిన మహమ్మద్ జాహిద్(39) అనే వ్యక్తిని హైదరాబాద్, మూసారాంబాగ్‌లో ఆదివారం తెల్లవారుఝామున సిట్, టాస్క్‌ ఫోర్స్ పోలీసులు జాఫిద్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఆర్ఎస్ఎస్,,బీజేపీ నేతలపై దాడులతోపాటు,నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నినట్లు పోలీసులు కనుగొన్నారు. జాహిద్ ఈ పథకం అమలు చేసేందుకు కోసం ఆరుగురు యువకులను నియమించుకున్నాడు. గతంలో మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో కూడా పోలీసులు జాహిద్‌ను ప్రశ్నించారు.పాకిస్తాన్ లోని ISI,,లాష్కరేతోయిబా లాంటి తీవ్రవాద సంస్థలతో జాహిద్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూసారాంబాగ్‌తోపాటు సైదాబాద్, చంపాపేట్, బాబానగర్, పిసల్ బండ, సంతోష్ నగర్‌లో అర్ధరాత్రి సిట్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, టాస్క్‌ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించి,దాదాపు 20 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనితో సంబంధం ఉందని భావిస్తున్న బేగంపేట్ బ్లాస్ట్ కేసులో పాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. అరెస్టైన నిందితులంతా జాహిద్ ఆధ్వర్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్న పోలీసులు, వీళ్లందరినీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.అలాగే వీరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలించగా, పలువురి అకౌంట్లలోకి భారీగా నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ జాహిద్ పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నరని తెలిసింది.అలాగే వీరి వద్ద నుంచి రెండు హ్యండ్ గ్రేనేడ్స్,,రూ.3,91,800 నగదు,,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *