AMARAVATHINATIONAL

ఉరి సెక్టార్ లో చొరబాటుకు పయత్నించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు-కాల్చివేసిన సైన్యం

అమరావతి: ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన కొంత మంది ఉగ్రవాదులు చొరబాటుకు చేసిన ప్రయత్నాలను భారత భద్రతా దళాలు నిరోదించాయి..కాల్పులు తరువాత ఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి,,పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు..
సంఘటనలోఇద్దరు ఉగ్రవాదులు మరణించగా మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డట్లు సమాచారం..ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్ ను తాత్కలికంగా నిలిపివేశారు.. రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల మేరకు… నియంత్రణ రేఖ ద్వారా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా భద్రతా దళాలకు విశ్వనీయమైన సమాచారం అందడంతో BSF దళాలు యాంటీ ఇన్ ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను పటిష్టం చేశారు..విడవకుండా కురుస్తున్న వర్షం కారణంగా తక్కువ దూరంలో వున్న వారు కూడా కన్పించని పరిస్థితిని ఆసరా చేసుకుని సాయుధ ఉగ్రవాదులు నియంత్రణ రేఖగుండా చొరబాటుకు ప్రయత్నించారన్నారు.. ఈ క్రమంలో భద్రతా దళాలకు,, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి..ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించి వుండవచ్చని,,మిగిన ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుపోయారని అధికారి ప్రతినిధి వెల్లడించారు..మరికొందరు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని, సంఘటనా స్థలంలో ఆయుధాలన్నీ రక్తంతో తడిసిపోయాయని పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *