CRIME

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసులో బయటకు వస్తున్న తెరవెనుక నాయకులు

ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు..

అమరావతి: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (E.D) సప్లిమెంటరీ ఛార్జ్షీట్  దాఖలు చేసింది..ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి సహా మరో నలుగురిపై ఈ ఛార్జ్‌ షీట్ దాఖలైంది.సౌత్గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,,శరత్చంద్రారెడ్డి,,మాగుంట శ్రీనివాసులురెడ్డి,,మాగుంట రాఘవ భాగస్వాములుగా ఉన్నారు..కవిత, విజయ సాయిరెడ్డి బంధువు శరత్చంద్రారెడ్డిల పాత్రపై ఈడీ పలు కీలక అంశాలు ప్రస్తావించింది..హోల్సేల్ వ్యాపారంలో 12 శాతం లాభాలు, రిటైల్లో 185% లాభాలు ఆదాయం సమకురేలా మద్యం విధాన రూపకల్పనలో అక్రమాలు జరిగాయని ఈడీ పేర్కొంది..కవిత హోల్సేల్ వ్యాపారంలోనూ, శరత్చంద్రారెడ్డి రిటైల్ వ్యాపారంలోనూ భాగస్వాములు మారారని వెల్లడించింది..హైదరాబాద్,బంజారాహిల్స్లోని కవిత నివాసంలో నిందితులు పలుమార్లు భేటీ అయ్యారని,, పాత్రధారులు, సూత్రధారులు ఢిల్లీ, హైదరాబాద్ హోటల్స్లో బస చేశారని ఈడీ ఛార్జ్‌ షీట్‌లో పేర్కొంది..శరత్చంద్రారెడ్డికి చెందిన చార్టెడ్ ఫ్లైట్స్లో నిందితులు, పాత్రధారులు ప్రయాణాలు చేశారని వెల్లడించింది..కవిత నివాసం, ఢిల్లీ లోధి రోడ్‌లోని మాగుంట శ్రీనివాస్రెడ్డి నివాసంలోనూ తాజ్మాన్సింగ్, ఒబెరాయ్, మేడిన్ హైదరాబాద్, ఐటీసీ, కోహినూర్ హోటళ్లలో సమావేశాలు జరిగాయని,,హవాలా మార్గంలో డబ్బు తరలించినట్లు ఈడీ ఛార్జ్‌ షీట్‌లో వెల్లడించింది.ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో కవిత తరపు ప్రతినిధి అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబులు,, సమీర్ మహేంద్ర ఇండో స్పిరిట్లో వాటా పొందారని వెల్లడించింది..హోల్సేల్ వ్యాపారంలో ఇండోస్పిరిట్ L1 గా నిలిచేలా కవిత ప్రయత్నాలు చేశారని,,ఇండోస్పిరిట్ కోసం ఆప్ నేతలతో కవిత మాట్లాడారని ఈడీ పేర్కొంది..కేసు వెలుగులోకి వచ్చాక అప్పటి వరకు వారు వాడిన సెల్ ఫోన్లు,ఇతరత్రా సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు నిందితులు ప్రయత్నించారని తెలిపింది..ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌నాయర్ వందల కోట్ల కిక్ బాగ్స్ అందుకున్నారని ఈడీ ఆరోపించింది.. లబ్ధి,, ప్రయోజనాలు కలిగించినందుకు ప్రతిఫలంగా హోల్సేల్ వ్యాపారంలో, వచ్చే లాభాల్లో ఆప్ నేతలకు 6 శాతం వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని,,ఎన్నికల కారణంగా ముందుగానే ముడుపుల వ్యవహారం నడిచిందని ఈడీ ఆరోపించింది..ఇండో స్పిరిట్ ద్వారా కవిత హోల్ సేల్ వ్యాపారంలో భాగస్వామి అయితే,, శరత్ చంద్రారెడ్డి రిటైల్ జోన్స్లో మద్యం వ్యాపారం చేశారని ఈడీ వెల్లడించింది..మొత్తం 32 జోన్లకుగాను సమీర్ మహేంద్రు,,శరత్ చంద్రారెడ్డి,, మాగుంట చెందిన సంస్థలు 9 జోన్లు దక్కించుకున్నాయని తెలిపింది..అలాగే సౌత్ గ్రూపుకు దక్కిన 9 రిటైల్ జోన్లలో శరత్ చంద్రారెడ్డికి చెందిన ట్రైడెంట్,, అవంతిక ఆర్గానోమిక్స్ 5 జోన్లలో మాగుంట రాఘవకు చెందిన మాగుంట ఆగ్రో ఫార్మ్స్ లిమిటెడ్ రెండు జోన్లలో వ్యాపారం చేసిందని ఈడీ ఛార్జ్‌ షీట్‌లో పేర్కొంది..ట్రైడెంట్, అవంతిక ఆర్గానోమిక్స్ల రిటైల్ వ్యాపారం కోసం తన కంపెనీలు మహిరా వెంచర్స్, యాక్సిస్ క్లినికల్స్ నుంచి శరత్ చంద్రారెడ్డి EMDలు చెల్లించారని ఈడీ తెలిపింది.

Spread the love
venkat seelam

Recent Posts

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

22 mins ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

47 mins ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

1 hour ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

2 hours ago

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

23 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

1 day ago

This website uses cookies.