DISTRICTSPOLITICS

గంజాయి రవాణపై కేంద్రం సిబిఐ దర్యాప్తుకు అదేశించాలి-ఆనం

నెల్లూరు: నార్కోటిక్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన నివేదికలో,మాదకద్రవ్యాల సరఫరాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుందని, ఏపీకి చెందిన 2 లక్షల కేజీల గంజాయిని దేశ వ్యాప్తంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని NCB వెల్లడించడం శోచనీయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుకున్న గంజాయి, హెరాయిన్ ఏపీ నుంచే రవాణా జరిగిందని  పోలీసులు వెల్లడించారని తెలిపారు. 2 లక్షల కేజీలు గంజాయి అధికారికంగా పట్టుకున్నారంటే, 40 లక్షల కేజీల గంజాయి  అనధికారికంగా రవాణా జరిగినట్లు భావించాల్సి వస్తుందన్నారు. గంజాయి కేజీ 60 వేల రూపాయలకు విక్రయిస్తున్నరని,,ఈ లెక్కన చూస్తే 3 లక్షల కోట్ల రూపాయల విలువచేసే గంజాయి వ్యాపారం ఏపీ నుంచి జరుగుతుందని ఆరోపించారు.విచ్చలవిడిగా గంజాయి దొరికుండడంతో, చిన్న పిల్లలు మత్తుకు అలవాటు పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గంజాయి రవాణా ఈ స్థాయిలో జరుగుతుంటే సీఎం జగన్ కి తెలీకుండా జరుగుతుందా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ నిర్దేశకత్వంలో,విశాఖపట్నం నుంచి విజయసాయిరెడ్డి గంజాయి రవాణా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ నాయకత్వం గంజాయి సరఫరాలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *