అమరావతి: మూడు దశాబ్దల తరువాత జమ్ము కశ్మీర్ లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి.కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కశ్మీర్ ప్రజలకు చారిత్రాత్మక రోజు అని, ఇలాంటి మాల్స్ ను ప్రతి జిల్లాలోనూ నెలకొల్పుతామని, సినిమా హాళ్లను యువతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతనాగ్, శ్రీనగర్, బందిపొర, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి ప్రాంతాల్లోనూ త్వరలోనే హాళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటితో పాటు వచ్చే వారంలో కశ్మీర్ లో తొలి ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానున్నదని,, శ్రీనగర్ లోని సోమ్ వార్ లో ఇది ప్రారంభమవుతుందన్న మనోజ్ సిన్హా వెల్లడించారు. 520 సీట్ల సామర్థ్యంతో మూడు స్ర్కీన్లు కలిగిన థియేటర్ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 1980వరకు కశ్మీర్ లో దాదాపు 12 థియేటర్లల్లో సినిమాలు ప్రదర్శించే వారు అయితే ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పని పరిస్థితిలోఅవి మూసివేశారు.అటు తరువాత 1990 దశకం ప్రారంభంలో మిగిలిన సినిమా హాళ్లన్నీ మూసేశారు. మళ్లీ సినిమా హాళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నించగా, 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ఉన్న రీగల్ సినిమా హాల్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు..