హైదరాబాద్: అన్నా యూనివర్సిటీతో గో డాడీ వెబ్ సైట్ల ద్వారా నకిలీ సర్టిఫికెట్ సృష్టించి,,ఒక్కొక్క సెర్టిఫికెట్ను రూ.50వేల నుంచి 1లక్షకు అమ్ముతున్న అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ తయారీ ముఠాను బషీర్ బాగ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ సందర్బంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ దాదాపు 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికెట్లను ఈ ముఠా సృష్టించారని తెలిపారు. ఇప్పటికి 30 మందికి ఈ సర్టిఫికేట్లను అందించారని గుర్తించామన్నారు. నకిలీ సర్టిఫికెట్స్ దందా చేస్తున్న నాలుగు ముఠా సభ్యులను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్స్తో కుమ్మకై ఈ దగాకు పాల్పపడుతున్నరని తెలిపారు.ఎవరికైతే నకిలీ సెర్టిఫికెట్ అవసరం ఉన్నదో వాళ్ళను ఆసరా చేసుకుని,,ఈ సిండికెట్ చెలామణి అవుతోందన్నారు. నిందితులపై హైదరాబాద్లోని పలు పోలీసుస్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయయని డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు.ప్రజలెవరూ ఇలాంటి నకిలీ సర్టిఫికెట్స్కు ప్రలోభ పడవద్దని కోరారు. నకిలీ సెర్టిఫికెట్స్ ద్వారా ఎలాంటి ఉద్యోగం పొందినా,,భవిష్యత్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నిందితులు మొహమ్మద్ ఏతేషాం, ఉద్దిన ఉసేన్, మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మొహమ్మద్ అల్తాఫ్ అహ్మద్, మొహమ్మద్ ఇమ్రాన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.