శ్రీపొట్టి.శ్రీరాముల ఆశయాలను ముందు తరాలు ఆచరించాలి-కలెక్టర్

నెల్లూరు: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగనీరతి వెలకట్టలేనిదని, ఆ మహనీయుడు చూపిన సన్మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ దేశసేవలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. గురువారం ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ లోని అయన విగ్రహాంకు పూలమాల వేసి నివాళిర్పించారు.ఈకార్యక్రమంలో శ్రీపొట్టి.శ్రీరాముల సహవాసి చలమయ్య,జడ్పీ ఛైర్మన్ ఆనం.అరుణమ్మ,కార్పొరేషన్ కమీషనర్ తదితరులు పాల్గొన్నారు.