AMARAVATHIHYDERABADMOVIE

హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ కన్నుమూత

హైదరాబాద్: హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 900పైగా సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు నల్లంపల్లి.చంద్రశేఖర్ (చంద్రమోహన్) 81 సంవత్సరాల వయో భారం కారణంగా గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు..ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ శనివారం ఉదయం 9.45 గంటలకు కన్నుమూశారు..దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతికి అభిమానులు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు..
1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో ఆయన జన్మించారు..చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్.. బాపట్లలో బీఎస్సీ పూర్తి చేశారు..ఆటు తరువాత ఏలూరులో కొంత ఉద్యోగం చేశారు.. సినిమాల్లో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన చంద్రమోహన్,, 1966లో ‘రంగులరాట్నం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు..అప్పటి నుంచి నటుడిగా, సహాయనటుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.. మొత్తం 932కి పైగా చిత్రాల్లో నటించారు.. హీరోగా దాదాపు 175 సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను షోపించారు.. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారానే ఆయన విశేష ప్రేక్షకాదరణ పొందారు.. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రెండు నంది పురస్కారాలు వరించాయి.. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి.
చంద్ర మోహన్,,అయన సతీమణి జలంధరకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. శనివారం,,ఆదివారం అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచి సోమవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *