AMARAVATHIPOLITICS

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో విడుదల చేశారు.
వైసీపీ మేనిఫెస్టోలో రాబోయే 5 సంవత్సరాల్లో ఆమలు చేయబోయే పథకాల గురించి వివరించారు..ఇందులో..
అమ్మఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు,,వైఎస్‌ఆర్‌ చేయూత కొనసాగింపు,,వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కొనసాగింపు,, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు,,మహిళలకు రూ.3లక్షల వరకు సున్నా వడ్డీ,,సామాజిక పెన్షన్లను రెండు విడుతల్లో రూ.3,500లకు పెంపు అది జనవరి 2028, జనవరి 2029లో రెండు విడుతల్లో వుంటుంది..కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు,,
అర్హులందరికీ ఇళ్లు పథకం కొనసాగింపు,,రూ.2వేల కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు,,రైతుభరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు,,వృద్ధాప్య పెన్షన్లు 2 విడతల్లో రూ.3,500లకు పెంపు,,మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు,, రైతు భరోసా సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు,,ఉచిత బీమా, పంటరుణాలు కొనసాగింపు,, వాహనమిత్ర పథకం కొనసాగింపు,,రాష్ట్రవ్యాప్తంగా 175 స్కిల్‌హబ్‌లు ఏర్పాటు,,జిల్లాకు ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ,,తిరుపతిలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ,,500లకుపైగా అవాసాలున్న దళితకాలనీలను పంచాయతీలుగా మారుస్తాం,, రాజధాని విషయంలో మూడు రాజధానుల ఏర్పాటు గురించి ప్రస్తవించారు.వైఎస్ జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసీపీ కార్యకర్తల్లోను,,ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది.. సోషల్ మీడియా వేదికగా అస్సలు బాగోలేదని కొందరు,,బాగనే వుంది అమలు చేసేవే చెప్పారని మరికొందరు వ్యాఖ్యనిస్తున్నారు.
Is the YCP manifesto clear?-news.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *