ఇండోనేషియాలో భారీ భూప్రకంపనలు,44 మంది మృతి ?

అమరావతి: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్ లో సోమవారం నాడు భారీ భూప్రకంపనల కారణంగా 44 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు 700 మందికి గాయాలయ్యాలు కాగా వేలాది ఇళ్ళు దెబ్బతిన్నాయి. జావాలో భూకంప తీవ్రత 5.6 గా నమోదయ్యింది. సియంజురును భూకంప కేంద్రంగా గుర్తించారు.ఇండోనేషియాలో కీలక పట్టణాలైన జావా, సియంజురు శిథిలాల దిబ్బగా మారిపోయాయి.ఎటు చూసినా గాయపడ్డవారే కనిపిస్తున్నారు.శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.