AMARAVATHINATIONAL

బిపర్ జోయ్ తుఫాన్ తీవ్రతపై వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు

అమరావతి: బిపర్ జోయ్ తుఫాన్ కారణంగా గుజరాత్, మహారాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముంబై మహానగరానికి తుఫాన్ వల్ల పెను ప్రమాదం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది..గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది..వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 10 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు తరలించియి..ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 80 రైలు సర్వీసులను తుఫాన్ ఎఫెక్ట్ తో రద్దు చేశారు..
పోర్ బందర్ కు పశ్చిమ నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన బిపపర్ జోయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశం ఉంది..తుఫాన్ తీరం దాటే సమయంలో అతితీవ్రంగా ఉంటుందని,, అధికార యంత్రాంగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ తీరాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది..గుజరాత్ లోని మాండ్వి- పాకిస్థాన్ లోని కరాచి మధ్య విస్తరించిన తుఫాన్ గుజరాత్ లోని జఖౌ పోర్ట్ వద్ద తుఫాన్ తీరం తాకనుంది..1965 నుంచి ఇప్పటివరకు అరేబియా సముద్రంలో 13 తుపానులు ఏర్పడ్డాయి..వీటిలో రెండే గుజరాత్ తీరాన్ని దాటాయి.. ఒకటి మహారాష్ట్రలో తీరాన్ని దాటింది..ఇంకొకటి పాకిస్థాన్ తీరాన్ని దాటింది.. మరో 3 ఒమన్-యెమెన్ ల వద్ద తీరాన్ని దాటాయి.. మరో 6 బలహీనపడి సముద్రంలోనే ముగిశాయి..ఈ నెల 6న మొదలైన బిపర్ జోయ్ తుఫాన్ 15న తీరం దాటనుంది..దాదాపు ఇప్పటికే 8 రోజుల 12 గంటలు పూర్తి చేసుకున్న తుఫాన్ మరో రెండు రోజులు ప్రభావం చూపనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *