AMARAVATHIHYDERABAD

బీజేపీపై తెలంగాణ ప్రజల నమ్మకం పెరుగుతూ పోతోంది-ప్రధాని మోదీ

హైదరాబాద్: గోల్డెన్ స్పైస్, పసుపు కోసం ప్రత్యేక బోర్డు ఇప్పటి వరకు లేదని,, పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు..ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షంషాబాద్ విమానాశ్రయం నుంచి పాలమూరులో జరుగుతున్న ప్రజాగర్జన సభకు ఓపెన్ టాప్ జీపులో చేరుకున్నారు..ఈ సందర్బంగా ప్రధాని మోదీకి బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికారు..ఈ సందర్బంలో ప్రధాని తెలంగాణపై వరాల జల్లులు కురిపించారు..ములుగు జిల్లాలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆ యూనివర్సిటీ పేరును సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంటూ తెలిపారు..అలాగే వరంగల్ – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ ను,,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొత్త భవనాలు ప్రారంభించారు.. హసన్-చర్లపల్లి HPCL LPG పైప్ లైన్,, సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు..అనంతరం బాహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ….2014తో పోల్చితే ప్రస్తుతం రెండు రెట్లు ఎక్కువ పసుపు ఎగుమతి చేస్తున్నమని,, పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు.. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రూ. 10 వేల కోట్లు అందించామని,, బీజేపీ ప్రతీ కుటుంబం గురించి ఆలోచిస్తుందని,,దేశమంతా మా కుటుంబమే అని అన్నారు.. బీజేపీపై తెలంగాణ ప్రజల నమ్మకం పెరుగుతూ పోతోందని,,ఇందుకు సాక్ష్యం, మోదీ ఇచ్చే గ్యారెంటీపై ఇక్కడి ప్రజలకు నమ్మకం ఉందన్నారు.. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పడుతోందని మోదీ మండిపడ్డారు.. సాగునీటి కాలువలు ఏర్పాటు చేశామని ఇక్కడి ప్రభుత్వం గొప్పగా చెప్తోంది అయితే ఆ కాలువలో నీరు ఉండదని దెప్పి పొడిచారు.. రైతు పథకాల పేరుతో తెలంగాణ సర్కారు అక్రమాలకు పాల్పపడుతోందని,, రైతుల సంక్షేమం కోసం తాము ఎన్నో చర్యలు చేపడుతున్నమని,,ఇందులో బాగంగా రైతుల కోసం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *