AMARAVATHIDISTRICTS

ఓటరు జాబితాలోని అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి-రోల్ జిల్లా అబ్జర్వర్

పరిష్కారాలు చూపిండి..

నెల్లూరు: ఓటరు జాబితాలోని క్లైయిములు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి పరిష్కారాలు చూపించాలని సంక్షిప్త సవరణ-2024 రోల్ జిల్లా అబ్జర్వర్ పోలా.భాస్కర్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అయిన హరినారాయణన్ తో కలసి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్ ఓ లు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లాలో ఓటర్ల జాబితా సంక్షిప్త  సవరణ కార్యక్రమం పై సమీక్షించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, నిజమైన ఓటర్లను నమోదు చేయాలన్నారు..వివిధ రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈసీ నిబంధనలు పాటించి పరిష్కరించాలన్నారు.. ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన నియోజకవర్గాలలో వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.. ఏ చిన్న ఫిర్యాదు అందిన చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సరైన విధంగా పరిష్కరించాలన్నారు..పెండింగ్ లో వున్న ఫామ్-6,7,8 క్లెయిమ్స్, అభ్యంతరాలను ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్ల జాబితాలపై సూచనలు తెలియజేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *