AMARAVATHIHYDERABADPOLITICS

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే-పవన్

హైదరాబాద్: నేను తెలంగాణలో పర్యటించక పోయినా జనసేనపార్టీ ఇక్కడ బలంగా ఉందంటే అది మీ అభిమానమేనని,,మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు తెలంగాణ యువత,, పారిపోరుకుండా జెండా పట్టుకుని నిలబడతారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు..గురువారం కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం గ్రౌండ్స్ లో బిజేపీ-జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం దోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ పోరాటానికి పునాది పడిందన్నారు..ప్రభుత్వం కౌలు రైతులను రైతులే కాదనడం దారుణమన్నారు..ధరణిలో వెబ్ సైట్ లో లోపాలున్నాయని విమర్శించారు.. అభివృద్ధి ఆంధ్రాలో జరగకపోతే తెలంగాణ యువత నష్ట పోతుందన్నారు..‘‘శివ అనే 16 ఏళ్ల చెంచు కుర్రాడు యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు నన్ను కలిశాడు..అప్పుడే అతనిలో పర్యవరణం పట్ల వున్న మమకారం అర్ధమైందని,, తెలంగాణ యువత నిప్పు కణిక అనడానికి శివనే నిదర్శనం అన్నారు..సనాతన ధర్మం.. సోషలిజం రెండూ నడప గలిగేది జనసేనపార్టీ ఒక్కటే అని చెప్పారు.. బీఆర్ఎస్ ని ఒక్కమాట అనక పోవడానికి కారణం నేను తెలంగాణలో తిరగక పోవడమే అని తెలిపారు..తెలంగాణలో అణగారిన వర్గాలకు జనసేన అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. మోదీ నాయకత్వ పటిమ నచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నాను,,,ఎవ్వరు కలసి వచ్చినా,, రాక పోయినా దక్షిణాది నుంచి మోదీకి మద్దతుగా నిలబడతాను అని గుజరాత్ వెళ్లి కలసి తెలియచేసిన విషయంను వెల్లడించారు.. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేయగలిగేది ప్రధాని మోదీ మాత్రమే అని స్పష్టం చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *