AMARAVATHINATIONALTECHNOLOGY

గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్ట్ వ్యోమ‌గాముల‌ను దేశంకు పరిచయం చేసిన ప్రధాని మోదీ

అమరావతి: ఇస్రో గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమ‌గాముల‌కు శిక్ష‌ణ ఇస్తున్న విష‌యం విదితమే..ఈ ప్ర‌తిష్టాత‌క మిష‌న్‌కు ఎంపికైన వ్యోమ‌గాముల‌ను మంగళవారం ప్ర‌ధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి ప‌రిచ‌యం చేశారు..కేర‌ళ‌లోని తిరువనంత‌పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఇస్రో కీర్తిని చాటే గ‌గ‌న్‌యాన్ మాన‌వ యాత్ర‌కు ఎంపికైన వ్యోమ‌గాముల వివ‌రాల‌ను వెల్ల‌డించారు..వీరిలో గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్,, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్,, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్,, వింగ్ కమాండర్ ఎస్ శుక్లాలు వుండడం అభినందనీయమన్నారు..ఈ సందర్బంలో నలుగురు వ్యోమగాముల దుస్తువులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెక్కలతో ఉన్న బ్యాడ్జీలను తొడిగి అభినందించారు..ఈ నలుగురు వ్యోమగాములు భారత వైమానిక దళానికి చెందిన అత్యుతమైన పైలట్లుగా ఉన్నారు..వీరంతా స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయులుగా రికార్డు దక్కించుకోనున్నారు..

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు:- అంతకు ముందు తిరువనంతపురం సమీపంలోని తుంబలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) పర్యటించి సందర్భంగా రూ.1,800 కోట్ల విలువైన మూడు ప్రధాన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు..అలాగే భారతదేశ మానవ సహిత అంతరిక్ష యాత్ర మిషన్ ‘గగన్‌యాన్’ పురోగతిని ప్రధాని సమీక్షించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *