ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును అందుకున్న రాజమౌళి

హైదరాబాద్: RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది..అంత ఘనతను,, కీర్తిని తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు అందించిన రాజమౌళికి ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ దక్కింది.. RRR సినిమాకు దర్శకత్వం వహించినందుకు ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డ్ అందుకున్నాడు..అవార్డ్ అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ‘అవార్డ్ తీసుకున్నందుకు ఎంత ఆనందంగా ఉందో స్టేజ్ మీదనుంచి మీ అందరిని చూస్తుంటే అంతే కంగారుగా ఉంది..నేను సినిమాని ఒక దేవాలయంగా భావిస్తా…చిన్నతనంలో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు ఎవరికైనా ఒకరకమైన ఆనందం కలుగుతుంది…అంతే ఆనందాన్ని నా సినిమా చూస్తున్నవాళ్లందరు పొందాలని అనుకుంటా…భారతదేశంలో సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తారో,,న్యూయార్క్,, చైనా లాంటి దేశాల్లోని ప్రజలు కూడా అంతే ఆనందించారు..సినిమాని ఇంతటి స్థాయికి తీసుకెళ్లిన “జూనియర్ NTR,,రామ్ చరణలకు దన్యవాదాలు” అని రాజమౌళి పేర్కొన్నాడు..