దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ-బీజెపీ అధ్యక్షుడు బండి.సంజయ్

హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాల కోసం, దేశ ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు.జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని బుధవారం బండి సంజయ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ నిజమైన వారసుడు ప్రధాని నరేంద్రమోదీ అని, 370 ఆర్టికల్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి నిర్ణయాలు అందులో భాగమేనని గుర్తు చేశారు.అతి చిన్న వయసులోనే కలకత్తా వర్శిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. ఎంతో మంది భావి భారత పౌరులను తీర్చిదిద్దారన్నారు..కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను చూసి తట్టుకోలేక బయటకు వచ్చి పోరాడారని,,జనసంఘ్ పార్టీని స్థాపించి కొత్త రాజకీయ ఉద్యమానికి తెరలేపిన వ్యక్తి ముఖర్జీ,, పశ్చిమబెంగాల్ ను పాకిస్తాన్ లో కలపాలనే కుట్రను వ్యతిరేకించి పోరాడిన నాయకుడన్నారు.. ఏక్ దేశ్ మే దో నిషాన్.. దో విధాన్… దో ప్రధాన్.. నహీచలేంగా అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన వ్యక్తి అన్నారు..ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేశం కోసం వెనుకాడకుండా పోరాడిన మహనీయుడని,, ఇతర దేశాల్లో వలస ఉన్న భారతీయులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన భావించిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేర్కొన్నారు..