అమరావతి: దేశంలోని విద్యుత్, నీటి బిల్లులు,ఇతర యుటిలిటీ బిల్లులను, భారత్ బిల్లు చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (NRI)లకు అనుమతిని ఇచ్చేందుకు ప్రతిపాదించింది..RBI గవర్నర్ శక్తికాంత దాస్, తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో శుక్రవారం ఈ మేరకు ప్రతిపాదించారు.. క్రాస్-బోర్డర్ ఇన్‌వర్డ్ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనున్నది..దింతో దేశంలో నివసిస్తున్న వారికి మిత్రమే మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇకపై NRIలకు లభించనుంది.. దీనికిసంబంధించి విధి విధానాలను త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్ పేర్కొన్నారు..ఈ నిర్ణయం ప్రకారం NRIలు,,భారతదేశంలోని వారి కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య ,ఇతర బిల్లు చెల్లింపులు విదేశాల నుంచే నేరుగా చేసుకోవచ్చు..ఇప్పటికే నెలవారీ ప్రాతిపదికన ఎనిమిది కోట్లకు పైగా లావాదేవీలను నిర్వహిస్తున్న ఇంటర్‌ఆపరబుల్ ప్లాట్‌ఫారమ్ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు, ప్రత్యేకించి వారి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు ఉపయుక్తంగా ఉంటుందని,, BBPS సేవల వృద్దితోపాటు, అదనంగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందవచ్చని యురోనెట్ వరల్డ్‌వైడ్ ఇండియా అ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రణయ్ ఝవేరి అన్నారు..