AMARAVATHIDISTRICTS

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిటిలేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫెసిటిలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసామన్నారు.  ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఉదయం7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వీస్ ఓటర్లు ఈ సెంటర్లల్లో పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంటుకు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అన్నారు. కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి ఓ.వి రోడ్ లోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో, కావలి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో, ఆత్మకూరులో పాలిటెక్నిక్ కాలేజీలో, కోవూరులో పి.ఆర్.ఎన్ జడ్పి బాలికల హైస్కూల్లో, ఉదయగిరిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో, నెల్లూరు సిటీకి సంబంధించి డీ.కే.డబ్ల్యూ కాలేజీలో, నెల్లూరు రూరల్ కు సంబంధించి వి.ఆర్.లా కాలేజీలో, సర్వేపల్లి కి సంబంధించి క్యూబా ఇంజనీరింగ్ కాలేజీలో ఫెసిటిలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాల ఓటర్లలకు సంబంధించి నెల్లూరు దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో ఫెసిటిలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 20 వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

ఒకరోజు క్యాజువల్ లీవ్ మంజూరు:- ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు వారికి కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఒకరోజు క్యాజువల్ లీవ్  మంజూరు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ల ద్వారా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *