AMARAVATHIDISTRICTS

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్ 25వ నాటికి సమీకృత ఓటర్ల జాబితాను రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, 117 – నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజక వర్గం గుర్థింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు అందజేశారు. స్థానిక కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ విభాగంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై ఫైనల్ ఓటర్ల జాబితాను ఆర్.ఓ నుంచి అందుకున్నారు. ఇతర గుర్తింపు పొందని రాజకీయ పార్టీల, ఇండిపెండెంట్ల అభ్యర్థులు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుంచి లేదా తగు రుసుమును చలానా ద్వారా చెల్లించి జాబితాను  రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి పొందగలరని రిటర్నింగ్ అధికారి తెలియచేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *