AMARAVATHITECHNOLOGY

విజయవంతమైన నావిక్ ఉపగ్రహాం ప్రయోగం-ఇస్రో ఛైర్మన్

అమరావతి: తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు GSLV-F12 వాహకనౌక NVS-01 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది..ప్రయోగం ఇస్రో ఛైర్మన్ విజయవంతమైనట్లు సోమనాథ్ ప్రకటించారు..ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై,, నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తరువాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.. GSLV-F12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు..భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో NVS-01 టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది..
భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన రుబిడియం అణుగడియారం నావిక్ ఉపగ్రహంలో అమర్చారు.. అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో అణుగడియారం నిర్మించారు..ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్ క్లాక్ పనిచేయడం మానేయగానే డేటా పంపడం నిలిపివేస్తాయి.. ఖచ్చితమైన ట్రాకింగ్ ను కూడా అందించలేవు.. రెండో తరం నావిక్ ఉపగ్రహాలు L1 సిగ్నల్స్ ను పంపగలవు..దీంతో ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతాయి..దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు,, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్ అమర్చే పరికరాల్లో,, పర్సనల్ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *