NATIONAL

40 మంది ఉగ్రవాదులను హతమార్చిడం జరిగింది-సీ.ఎం ఎన్ బీరెన్ సింగ్

అమరావతి: మణిపూర్లో అల్లర్లు చేలరేగిన అనేక ప్రాంతాల్లో కమాండోలు ఎనిమిది గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించి దాదాపు 40 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తమకు నివేదికలు అందాయని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారం తెలిపారు..“ఉగ్రవాదులు పౌరులపై M-16, AK-47 అసాల్ట్ రైఫిల్స్, స్నిపర్ గన్‌లను ఉపయోగిస్తున్నారని,,ఉగ్రవాదులు ఇళ్లను తగలబెట్టడానికి చాలా గ్రామాలకు వచ్చారన్నారు..సైన్యం సహా ఇతర భద్రతా దళాల సహాయంతో వారిపై చాలా బలమైన చర్య ప్రారంభించామన్నారు..ఈ చర్యలకు పాల్పపడుతున్న వారిని కుకీ టెర్రరిస్టులనే అంటానని సీ.ఎం స్పష్టం చేశారు..వారు నిరాయుధులైన పౌరులపై కాల్పులు జరుపుతున్నారని మండిపడ్డారు..ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఇంఫాల్ లోయ, చుట్టుపక్కల ఐదు ప్రాంతాలపై ఉగ్రమూకలు ఏకకాలంలో దాడి చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి..హోంమంత్రి అమిత్ షా సోమవారం మణిపూర్‌లో పర్యటించనున్నారు..ప్రశాంతత, శాంతిని కొనసాగించాలని, సాధారణ స్థితిని తీసుకురావడానికి కృషి చేయాలని హోం మంత్రి ఇప్పటికే కుకీలకు విజ్ఞప్తి చేశారు..భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల పర్యటన నిమిత్తం శేనివారం రాష్ట్రానికి వెళ్లారు..షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీలో చేర్చాలన్న మొయిటీల డిమాండ్‌పై ఇంఫాల్ లోయ సహా చుట్టుపక్కల నివసించే వీరు,,కొండల్లో స్థిరపడిన కుకీ తెగల మధ్య మే 3వ తేదిన ఘర్షణ మొదలైంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *