మా నాన్నకు ఏ సిటీ అయితే అన్ని ఇచ్చిందొ,నెల్లూరుకు తిరిగి ఇస్తారు-డాక్టర్ సింధూర
నెల్లూరు: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ పొంగూరు.నారాయణ నెల్లూరును స్మార్ట్ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని,, సైకిల్ గుర్తుపై ఓటేసి నారాయణ సార్ని గెలిపించుకుంటే నెల్లూరు రూపురేఖలే మారుతాయని టీడీపీ ఎమ్మేల్యే అభ్యర్ది నారాయణ, కుమార్తె డాక్టర్ సింధూర అన్నారు.మంగళవారం నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని 46 డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సదర్బంలో అమె మాట్లాడుతూ మా నాన్నకు ఏ సిటీ అయితే ఈ స్థాయిలో అభివృద్ది చెందేందుకు అన్ని ఇచ్చిందొ,నెల్లూరుకు తిరిగి అదే స్థాయిలో అభివృద్ది చేసి తిరిగి ఇస్తారని భరోసా ఇచ్చారు.ఈకార్యక్రమంలో 46వ డివిజన్ టీడీపీ ఇన్ చార్జీ,తదితరులు పాల్గొన్నారు.