AMARAVATHIDEVOTIONALNATIONAL

నక్సల్స్ మూసివేయించిన రామాలయాని తిరిగి తెరిపించిన CRPF జవాన్లు

అమరావతి: దాదాపు రెండు దశాబ్దల క్రిందట నక్సల్స్ మూసివేయించిన ఓ రామాలయాన్ని తిరిగి సోమవారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్లు తెరిచారు..నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని లఖాపాల్, కేరళపెండా గ్రామాల సమీపంలో 1970లో బిహారీ మహారాజు ఓ రామాలయాన్ని నిర్మించారు..ఈ గుడిలో ఎలాంటి పూజలు చేయకూడదని 2003లో నక్సల్స్ ఈ ఆలయాన్ని మూసివేశారు..వారి బెదిరింపుల కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకూ దాదాపు 21 సంవత్సరాల పాటు ఏ ఒక్కరూ రాముడి గుడి తలుపులను తెరిచేందుకు ధైర్యం చేయలేదు.. నక్సల్స్ (మావోయిస్టులను) ఏరివేత కార్యక్రమంలో బాగంగా CRPF 74వ బెటాలియన్ కోసం లఖాపాల్ క్యాంప్ ను కేరళపెండా గ్రామానికి సమీపంలో 2023లో ఏర్పాటు చేశారు… CRPF బెటాలియన్ ఈ ప్రాంతంలో వుండడంతో నక్సల్స్ ప్రభావం క్రమేపి కనుమరుగు అవుతూ వస్తొంది..దింతో తమ గ్రామంలో ఉన్న పురాతనమైన రామాలయం గురించిన CRPF సిబ్బందికి గ్రామస్థులు తెలిపారు.. CRPF ఉన్నతధికారులు ఆలయాన్ని తిరిగి తెరిపించి ఎప్పటిలాగే పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు..తాళం వేసి ఉన్న మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు..అనంతరం సదరు గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత గుడిని బాధిత గ్రామ పెద్దలకు అప్పగించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *