AMARAVATHIINTERNATIONAL

కుప్పకూలిపోయిన రష్యా లూనా-25 ల్యాండర్

అమరావతి: భారతదేశం కంటే ముందుగా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు ఆగష్టు 11వ తేదిన రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది..చంద్రునికి దగ్గరలో చేరుకున్నప్పటి సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని,, లూనా-25తో కమ్యూనికేషన్స్ అదివారం మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని,,దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వెల్లడించింది..కొన్ని గంటల ముందు లూనా-25 ల్యాండర్ లో సమస్యలు తలెత్తాయని తెలిపింది..రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా పేర్కొంది..ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే తమ ప్రయోగం విఫలమైందని ప్రకటించింది.వీలైనంత వరకు లూనా-25 ల్యాండర్ తో కమ్యూనికేషన్స్ కోసం ప్రయత్నిస్తామని వెల్లడించింది..గతంలో చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ ను దృష్టిలో వుంచుకుని,,భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది..ఈ సారి ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఇస్రో అనేక మార్పులు చేసింది.. అదివారం వేకువజామున చంద్రయాన్-3 మధ్య రెండో,,చివరి డీ-బూస్టింగ్ ను విజయవతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటన విడుదల చేసింది..చంద్రుడికి చేరువైన విక్రమ్ ల్యాండర్,, ల్యాండింగ్ కావడమే మిగిలి వుంది..రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైన వేళ ప్రపంచం దృష్టి చంద్రయాన్-3 పైనే వుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *